: సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజలది : లగడపాటి


సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల్లోంచి వచ్చిందని, తెలుగు తల్లిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకుంటామని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన సభలో లగడపాటి మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల్లోంచి పుట్టి పలు సంఘాలకు వ్యాప్తి చెందిందని అన్నారు. దీని వెనుక నేతల ప్రమేయం కానీ, రాజకీయ నిరుద్యోగం కానీ లేదన్నారు. అలాగే హైదరాబాద్ ఏ ఒక్కరి సొత్తు కాదని, రాజధాని అందరికీ చెందుతుందని అన్నారు. అంతిమంగా సమైక్యవాదమే నెగ్గుతుందని అన్నారు. శాంతియుత ఉద్యమంతోనే లక్ష్యాన్ని సాధించవచ్చని చెప్పారు. సమైక్యవాదాన్ని వినిపించేందుకు వచ్చిన యువతతో బందరు రోడ్డు జనసంద్రంగా మారింది. రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని, సమైక్యంగా ఉంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News