: కొనసాగుతున్న జగన్ నిరాహార దీక్ష
చంచల్ గూడ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చేపట్టిన నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా జగన్ దీక్ష చేపట్టిన విషయం విదితమే. మూడు రోజులుగా ఆహారం లేకపోవడంతో జగన్ నీరసపడ్డారు. నిన్న వైద్యులు మూడు పర్యాయాలు జగన్ ను పరీక్షించారు. బీపీ, షుగర్, నాడి పరీక్షలు జరిపారు. అన్నీ సాధారణంగానే ఉన్నాయని వెల్లడించారు. ఆహారం తీసుకోవాలని కోరినా జగన్ నిరాకరించినట్లు సమాచారం. దీక్ష మూడు రోజులు దాటడంతో వైద్యులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.