: పట్టీ పరీక్షతో క్షయవ్యాధి గుర్తింపు
ఇప్పటి వరకూ క్షయ వ్యాధిని పరీక్షించడానికి ల్యాబ్‌ల చుట్టూ తిరగడం జరిగేది. అలా కాకుండా ఒక పట్టీద్వారా ఈ వ్యాధిని గుర్తించేలా వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక కొత్త తరహా పరీక్షను అభివృద్ధి చేశారు. ఈ పరీక్షలో వ్యాధి సోకిన పేషంట్‌కు ఒక పట్టీని చేతికి అతికిస్తారు. ఈ పట్టీకింద ఉండే అత్యంత సూక్ష్మమైన బయోడిగ్రేడబుల్ సూదులు చర్మం పైపొరలో కలిసిపోతాయి. ఈ సూదులకు అంతకుముందే ఔషధాన్ని పూతగా పూస్తారు. సూదులు చర్మంలో కలిసిపోయినప్పుడు ఔషధం కూడా చర్మంలోకి తద్వారా దేహంలోకి చేరుతుందని అప్పుడు వ్యాధిని గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.