: కొల్లగొడుతున్న కోహ్లీ
విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యం.. అని అందరూ ముక్తకంఠంతో చెప్పేమాట. బ్యాటింగ్ లో మెరుపులు, కెప్టెన్సీలో పట్టువిడుపులు, ఆఫ్ ద ఫీల్డ్ లో మూటలకొద్దీ కాసులు.. ఇలా సాగుతోంది కోహ్లీ కెరీర్ గ్రాఫ్. టీమిండియా విజయాల్లో కీలకపాత్రతో వైస్ కెప్టెన్ స్థాయికి ఎదిగిన ఈ ఢిల్లీ డైనమైట్ పై కార్పొరేట్ సంస్థల కళ్ళు పడడంలో వింతేముంది. వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ అంబాసిడర్ ప్రతిపాదనలు వెల్లువెత్తాయి. టీమిండియా సహచరులతో కోలా యాడ్, తమన్నాతో మొబైల్ ఫోన్ ప్రకటనతో అడ్వర్టయిజింగ్ రంగంలో దుమ్మురేపిన కోహ్లీ.. తాజాగా బాలీవుడ్ తార అనుష్క శర్మతో సల్సా డ్యాన్స్ చేసేందుకు సై అంటున్నాడు. ఓ షాంపూ ప్రకటనలో ఆమెతో కలిసి నటించనున్నాడీ రఫ్ లుక్ క్రికెటర్. తాజాగా ముంబయి తారతో డ్యాన్స్ ఎలా చేస్తాడో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.