: విభజన నిర్ణయంపై సోనియా వెనక్కి తగ్గనన్నారు: డీకే అరుణ


రాష్ట్ర విభజన నిర్ణయంపై వెనక్కి తగ్గేదిలేదని అధినేత్రి సోనియాగాంధీ గట్టిగా చెప్పారని సమాచార ప్రసార శాఖ మంత్రి డీకే అరుణ చెప్పారు. దీనివల్ల ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని సోనియా హామీ ఇచ్చారని తెలిపారు. ఇరు ప్రాంతాల అభిప్రాయాలు ఆంటోనీ కమిటీకి చెప్పాలని సోనియా తెలిపారని అరుణ పేర్కొన్నారు. కాబట్టి, వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని తెలంగాణ ప్రకటనపై కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతాభినందన చెప్పేందుకు మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన సభలో ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే, తెలంగాణకు అనుకూలమని ఒకప్పుడు టీడీపీ, వైఎస్సీర్సీపీ లేఖలు వారే ఇచ్చి విమర్శలు చేయడం దారుణమన్నారు. తెలంగాణ కోసం అనేకమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని అరుణ గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News