: కాంగ్రెస్-వైఎస్సార్సీపీ లాలూచీ బట్టబయలైంది: టీడీపీ


తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలపై టీడీపీ ఎంపీలు నిప్పులు చెరిగారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీలు కొనకళ్ళ నారాయణ, సీఎం రమేశ్ తదితరులు ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ మధ్య లోపాయికారీ ఒప్పందం బట్టబయలైందన్నారు. తాజాగా, ప్రభుత్వం జగన్ ఆరోగ్య స్థితిపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేయడమే అందుకు నిదర్శనమని వివరించారు. విజయమ్మకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం ఇందులో భాగంగానే అని ఆరోపించారు. తెలుగు ప్రజల జీవితాలతో తల్లి, పిల్ల కాంగ్రెస్ పార్టీలు ఆటలాడుతున్నాయని వారు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News