: ఎన్టీఆర్ ఉన్నప్పుడే 'ఆహార భద్రత బిల్లు'ను తీసుకొచ్చారు: హరికృష్ణ
తన తండ్రి నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 'ఆహార భద్రత బిల్లు'ను తీసుకొచ్చారని హరికృష్ణ అన్నారు. లోక్ సభలో నిన్న ఆమోదం పొందిన ఈ బిల్లుపై మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నానంటూ కొందరు అంటున్నారన్న హరికృష్ణ, వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.