: కాలేజీ విద్యార్థిని అపహరణ, అత్యాచారం
అరాచకాల కేంద్రం ఉత్తరప్రదేశ్ లో మరో బాలికపై అత్యాచారం జరిగింది. మీరట్ సమీపంలో చిందూరి గ్రామానికి చెందిన బీఏ విద్యార్థిని కాలేజీకి వెళుతుండగా.. నలుగురు యువకులు కారులో వచ్చి ఆమెను బలవంతంగా ఎక్కించుకున్నారు. అనంతరం గ్రామ సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆమె కేకలు విన్న గ్రామస్తులు పరుగున వచ్చి ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు ప్రకటించారు. పట్టుబడ్డ ఇద్దరిలో అశు అనే వ్యక్తి బాధితురాలికి తెలిసినవాడేనని చెప్పారు.