: మొయిలీ ఆంధ్రా, తెలంగాణ ఎంపీల మధ్య చిచ్చు పెట్టాడు: దేవినేని


వీరప్ప మొయిలీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ఆంధ్రా, తెలంగాణ ఎంపీల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుకుంటున్నాడని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. విజయవాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ అసమర్ధత వల్లే కృష్ణా ట్రైబ్యునల్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని అన్నారు. కృష్ణా జలాల కోసం కలసికట్టుగా పోరాడాల్సిన ఆంధ్రా, తెలంగాణ నేతల మధ్య చిచ్చుపెట్టి రైతుల కడుపు కొట్టారని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ఎంపీలంతా యూపీఏపై పోరాడాలన్నారు. కృష్ణా జలాలపై గతంలో చంద్రబాబు మహాధర్నా చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని ఉమా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News