: టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటిముందు దీక్ష చేయాలి: భూమా
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దీక్షలు చేస్తున్న తెలుగుదేశం నేతలు ముందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిముందు దీక్ష చేయాలని వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డి సూచించారు. సమైక్యాంధ్ర కోసం చిన్నారులు, వృద్ధులు రోడ్ల మీదకు వచ్చి ఉద్యమం చేస్తుంటే బాబు మాత్రం ఇంట్లో దాక్కున్నాడని భూమా విమర్శించారు. వైఎస్ కుటుంబాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలను ప్రజలే తిప్పి కొడతారన్నారు.