: ప్రధానిని కలిసిన ఏపీఎన్జీవో నేతలు
ఏపీఎన్జీవో, విద్యుత్, ఆర్టీసీ, విద్యార్థి సంఘాల నేతలు ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, విభజన వల్ల తెలుగుజాతి తీవ్రంగా నష్టపోతుందని అందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు. దీనికి ప్రధాని హైదరాబాద్ సహా అన్ని సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సమస్యలన్నీ పరిష్కరించాకే విభజన నిర్ణయాన్ని అమలు చేస్తామని ప్రధాని ఏపీఎన్జీవోలకు స్పష్టీకరించారు.