: రూపాయి పతనం ఆగుతుంది.. ఓపిక పట్టండి: చిదంబరం


రూపాయి పతనం స్టాక్ మార్కెట్లను వణికిస్తోంది. కరెన్సీ మారకం విలువ 65.70 స్థాయికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలలో కొనసాగుతున్నాయి. దీంతో ఆందోళన తొలగించేందుకు, ఆర్థిక మంత్రి చిదంబరం రాజ్యసభలో రూపాయిపై ప్రకటన చేశారు. రూపాయి మారకం విలువ క్షీణత దేశీయ కారణాల వల్లేనని చెప్పారు. మే నెల నుంచి రూపాయిపై ఒత్తిడి కొనసాగుతోందని, విలువను నిలబెట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంతకుముందు చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. రూపాయి వాస్తవ విలువ కంటే ఎక్కువగా నష్టపోయిందని చెప్పారు. కాస్త ఓపిక వహించాలని సూచించారు. ప్రభుత్వం చేయాల్సినవి చేసిందని, రూపాయి తగిన స్థాయిలో స్థిరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతీ వర్దమాన దేశం సవాళ్లు ఎదుర్కొంటోందని, అలాగే భారత ఈక్విటీ మార్కెట్, రూపాయిపై కూడా ఒత్తిడి ఉందని చెప్పారు. ఆహార భద్రత బిల్లు అమలు వల్ల లోటు పెరగదన్నారు.

  • Loading...

More Telugu News