: హెచ్ పీసీఎల్ మృతులు 11 మంది


విశాఖ హెచ్ పీసీఎల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఒప్పంద కార్మికుడు మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 11కి చేరింది. నలుగురు క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించారు. అయితే ఇప్పటికీ కంపెనీ యాజమాన్యం ప్రమాద బాధితుల వివరాలు వెల్లడించకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

  • Loading...

More Telugu News