: మంత్రి శైలజానాథ్ కు చేదు అనుభవం


మంత్రి శైలజానాథ్ కు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న శైలజానాథ్ ను వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు అడ్డుకున్నారు. తక్షణం రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ మంత్రిని నిర్బంధించారు. ఎవరి ప్రయోజనం కోసం ర్యాలీ చేస్తున్నారంటూ మంత్రిని ప్రశ్నించారు. మంత్రివి మాటలే తప్ప చేతలు కావని నినాదాలు చేసి చెవులు మూసుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో మంత్రి అనుచరులు, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన కారులను చెదరగొట్టారు. ఇక, పట్టణంలో సమైక్యాంధ్ర జేఏసీ 72 గంటల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు.

  • Loading...

More Telugu News