: సోనియా ఆరోగ్యం బాగానే ఉంది: ఆజాద్
ఛాతీ నొప్పి, వైరల్ ఫీవర్ తో నిన్న రాత్రి అత్యవసరంగా ఎయిమ్స్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నారు. సోనియాగాంధీకి వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత ఆమె ఆరోగ్య స్థితి సాధారణంగానే ఉందని నిర్ధారించుకుని ఈ తెల్లవారుజామున డిశ్చార్జ్ చేశారు. సోనియా ఆరోగ్యం బాగానే ఉందని, జలుబుతో ఇబ్బంది పడుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ తెలిపారు.