: రాయబారానికి ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ నేతలు
తెలంగాణ కోసం టీఆర్ఎస్ నేతలు రాయబారానికి బయల్దేరారు. సమైక్యాంధ్ర నేతల ప్రయత్నాలు ఢిల్లీలో ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల్లో చలనం వచ్చింది. జాతీయ పార్టీల నేతలను కలుసుకుని తెలంగాణ ఆవశ్యకతను మరోసారి చెప్పేందుకు టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, గంగుల కమలాకర్ ఢిల్లీకి వెళ్లారు.