: కిడ్నీ టెస్టుకు బయటికెళ్లాల్సిన పనిలేదట!


మూత్రపిండాల పరీక్షలు చేయించుకోవాలంటే పొద్దున్నే ల్యాబ్ కి వెళ్ళాల్సిన బాధ ఇక మనకు తప్పుతుంది. ఇందు కోసం అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక బుల్లి పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరాన్ని ఒక స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం చేసుకుని ఇంట్లోనే షుగరు, తీవ్రస్థాయి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు వాటికి సంబంధించిన పరీక్షలను చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వారికోసమే పరిశోధకులు ఈ కొత్త పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం రోగి మూత్రంలోని ఆల్బుమిన్‌ స్థాయిని గుర్తిస్తుంది. ఫలితాన్ని కొన్ని సెకన్లలోనే తెలియజేస్తుంది. ఆల్బుమిన్‌ అనేది రక్తంలో ఉండే ఒక ప్రోటీను, ఇది మూత్రంలో కనిపించడం అనేది ప్రమాదానికి సంకేతంగా భావించాలి. ఈ పరికరాన్ని గురించి ఈ పరిశోధనలో పాలుపంచుకున్న అయదోగన్‌ ఆజ్కాన్‌ మాట్లాడుతూ మూత్రపిండాలకు కలిగిన నష్టాన్ని గుర్తించడానికి ఆల్బుమిన్‌ పరీక్షను తరచూ నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మధుమేహ రోగులకు దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరికరం ఇళ్లలోను, సెల్‌ఫోన్లు పనిచేయని మారుమూల ప్రాంతాల్లోను ఉంటే దీర్ఘకాల రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News