: ఆంటోనీ కమిటీకి వాదనలు వినిపించనున్న రఘువీరా, ఆనం
రాష్ట్ర మంత్రులు రఘువీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి హస్తిన బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఆంటోనీ కమిటీ ముందు తమ వాదనలు వినిపించేందుకు వీరు ఢిల్లీ పయనమయ్యారు. సీమాంధ్రలో ఉద్యమం, విభజిస్తే ఎదురయ్యే పరిణామాలపై వీరు ఆంటోనీ కమిటీకి వివరించనున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ ఖాయమని వెల్లడించే అవకాశముందని కాంగ్రెస్ మంత్రివర్గ సహచరులు అంటున్నారు.