: సీమాంధ్ర టీడీపీ ఎంపీలకు వైద్య పరీక్షలు
ఈ ఉదయం నుంచి పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేపట్టిన సీమాంధ్ర టీడీపీ ఎంపీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్య స్థితిగతుల రీత్యా వైద్యులు వారిని పరీక్షించారు. వారికి షుగర్, బీపీ ఉన్నట్టు తెలిపారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలను ఉభయసభల నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.