: సుప్రీం మాజీ చీఫ్ జస్టిస్ పై కోర్టులో పిల్
సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని జస్టిస్ బీఎస్ చౌహాన్ ఆధ్వర్యంలోని బెంచ్ అడిగింది. కుమార్తె, అల్లుడు, సోదరుడు పేరుమీద బినామీ ఆస్తులు కలిగి ఉన్నారంటూ కొన్ని రోజుల కిందట కోర్టులో పిల్ దాఖలైంది. ఆ ఆస్తుల నుంచి వస్తున్న ఆదాయాన్ని ఇప్పటికీ బాలకృష్ణన్ అనుభవిస్తున్నారని అందులో పేర్కొన్నారు. కాబట్టి, ప్రస్తుతం 'జాతీయ మానవహక్కుల కమిషన్' పదవిలో కొనసాగుతున్న ఆయనను తొలిగించాలంటూ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ వ్యాజ్యంలో కోరారు.