: కాఫీ కప్పుతో భర్తను చంపిన ఇల్లాలు
తన భర్త మరో మహిళను ఇష్టపడడాన్ని ఆ జపాన్ మధ్య వయస్కురాలు జీర్ణించుకోలేకపోయింది. చేతిలో ఉన్న కాఫీ కప్పుతోనే అతగాడిని అంతమొందించింది. వివరాల్లోకెళితే.. యసువో హిరోసే (70) యోకహామా యూనివర్శిటీలో గౌరవ ప్రొఫెసర్. అతని భార్య ఎమికో హిరోసే (61) ఓ గృహిణి. ఓ రోజు ఆమెకు దిగ్భ్రాంతికర నిజం ఒకటి తెలిసింది. తన భర్తకు మరో స్త్రీతో ఎఫైర్ ఉందన్న విషయం ఆమెను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తనను మోసం చేశాడన్న ఆవేశం పట్టలేక ఆమె వెంటనే చేతిలో ఉన్న కాఫీ కప్పుతో భర్త తలపై అదేపనిగా మోదడంతో ఆ ప్రొఫెసర్ ప్రాణాలు విడిచాడు. పోలీసులు ఆమెను అరెస్టు చేయగా, 'మరో స్త్రీతో అతడికి వివాహేతర సంబంధం ఉంది, ఆ వ్యవహారం నాకు నచ్చలేదు, అందుకే కొట్టిచంపాను' అని చెప్పింది.