: విద్యుత్ సౌధ వద్ద మిన్నంటిన నినాదాలు.. పరిస్థితి ఉద్రిక్తం


విద్యుత్ సౌధను సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు నినాదాలతో హోరెత్తించారు. విద్యుత్ సౌధలో ఇరువర్గాలు తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తుండగా అక్కడకు టీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కొప్పుల హరీశ్వర్ రెడ్డిలు చేరుకున్నారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బయటి వారినెవ్వరినీ అనుమతించడం లేదని స్పష్టం చేశారు. అయినా తాము విద్యుత్ సౌధలోనికి వెళ్లి తీరుతామని భీష్మించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో హరీష్ రావు, హరీశ్వర్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.

  • Loading...

More Telugu News