: కాంగ్రెస్ పార్టీకి కాటసాని గుడ్ బై... ఆమరణ దీక్ష


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధినేత స్థాయిలో జగన్ దీక్ష చేపట్టారని, అతని దీక్షకు మద్దతుగా తాను కూడా కర్నూలులో ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నానని తెలిపారు. త్వరలోనే తాను వైఎస్సార్సీపీలో చేరతానని అన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రి కాకముందు ఒకలా, మంత్రి పదవి వచ్చిన తరువాత ఇంకొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News