: మత స్వాతంత్ర్యంపై సమాజ్ వాదీ పార్టీ యుద్ధం ప్రకటించినట్టుంది: యోగి ఆదిత్యనాథ్


మత స్వాతంత్ర్యంపై సమాజ్ వాదీ పార్టీ యుద్ధం ప్రకటించినట్టు ఉందని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ పవిత్ర భారతదేశంలో హిందువులు పుణ్యయాత్రలు చేసుకోవడమే గగనంగా మారిపోతోందని అన్నారు. కోసీ యాత్ర పవిత్ర ఉద్దేశం కోసం నిర్ధేశించినదని, శాంతియుతంగా యాత్రను జరుపుతున్న సాధువులను అన్యాయంగా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. వీహెచ్ పీ యాత్రను అడ్డుకోవడం దారుణమన్న యోగి, లౌకికవాదమంటే హిందూ వ్యతిరేకం కాదని గుర్తించాలని సూచించారు. యూపీఎ ప్రభుత్వం మత స్వాతంత్ర్యాన్ని అడ్డుకునేందుకే కంకణం కట్టుకున్నట్టు ఉందని యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు.

  • Loading...

More Telugu News