: టీజేఏసీ ఉద్యమ బాట
తెలంగాణ రాజకీయ ఐకాస తమ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. మార్చి నెలలో ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ఈ కార్యక్రమం చేపడతామని ఆయన చెప్పారు. మరోవైపు ఈ నెల 16 నుంచి 21 వరకు తెలంగాణ మంత్రుల నియోజక వర్గాల్లో యాత్రలు చేపట్టాలని తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది.
ఫిబ్రవరి 24న హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిని, మార్చి 2న హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కోదండరాం తెలిపారు. అలాగే ఫిబ్రవరి 11, 12 తేదీల్లో శంషాబాద్ నుంచి అలంపూర్ కు బెంగళూరు జాతీయ రహదారిపై బస్సు యాత్ర, ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హయత్ నగర్ నుంచి కోదాడ వరకు విజయవాడ జాతీయ రహదారిపై బస్సు యాత్ర చేపట్టనున్నట్లు టీ జేఏసీ ప్రకటించింది.