: హెచ్ పీసీఎల్ తరహా ప్రమాదం ఎక్కడా జరగలేదు: సీఎండీ రాయ్ చౌదరి
విశాఖపట్నంలోని హెచ్ పీసీఎల్ లో టనెల్ పేలడంతో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం గతంలో మరక్కెడా జరగలేదని ఆ సంస్థ సీఎండీ రాయ్ చౌదరి అన్నారు. పూర్తిగా ఊహకందని ప్రమాదని పేర్కొన్నారు. ఘటన వల్ల ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని చెప్పారు. రిఫైనరీపై అంతర్జాతీయ నిపుణులతో మదింపు చేయిస్తామని హామీ ఇచ్చిన సీఎండీ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.20 లక్షలు నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు.