: ఫ్యాప్సీ భవన్ లో కొనసాగుతున్నవామపక్షాల ఆందోళన
విద్యుత్ ఛార్జీలపై ఏర్పాటుచేసిన బహిరంగ విచారణను ఈఆర్ సీ అధికారులు నిలిపివేశారు. వామపక్షాలు, టీడీపీ ఆందోళన చేయడంతో అధికారులు విచారణను నిలిపివేయాల్సి వచ్చింది. కాగా, ప్రస్తుతం ఫ్యాప్సీ భవన్ లో విచారణ వేదిక ఎదుట వామపక్షాలు, టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. అక్కడే బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. వారిని అడ్డుకుని అక్కడినుంచి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.