: మ్యూజిక్‌ వింటూ ప్రయాణం ప్రమాదమే!


మీకు సంగీతం అంటే చాలా ఇష్టం... దీంతో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు సంగీతం వింటూ ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే మీరే డ్రైవింగ్‌ చేయాల్సి వస్తే మాత్రం సంగీతం వింటూ మాత్రం డ్రైవింగ్‌ చేయకండి అంటూ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా సంగీతాన్ని వింటూ డ్రైవింగు చేసేవారు తమ డ్రైవింగులో పలు తప్పులు చేసే అవకాశముందని ఒక పరిశోధనలో తేలింది.

టీనేజ్‌ వయసులో ఉండేవారు ఎక్కువగా తమకిష్టమైన సంగీతాన్ని వింటూ కారు నడపాలనుకుంటారు. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే టీనేజ్‌ పిల్లలు తమకిష్టమైన సంగీతాన్ని వింటూ కారు స్టీరింగ్‌ ముందు కూర్చుంటే కచ్చితంగా భయపడాల్సిందేనని, ఇలాంటి సమయాల్లో పిల్లలు వాహనాలను నడపడంలో పలు తప్పులు చేస్తారని, డ్రైవింగ్‌ విషయంలో వారి అంచనాలు తప్పుతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాలను అధ్యయనం చేయడంకోసం వారు కొందరు యువతీ యువకులను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నారు. వారు డ్రైవింగ్‌ చేస్తుంటే పరిశోధకులు పక్కనే కూర్చుని వారి డ్రైవింగ్‌ను పరిశీలించారు. వారిని నలభై నిముషాల పాటు వాహనాన్ని నడపాల్సిందిగా పరిశోధకులు నిర్దేశించారు. ఈ ప్రయాణ సమయంలో ఆ యువతీ యువకులు తమకు ఇష్టమైన సంగీతాన్ని వింటూ నడిపే ఏర్పాటు చేసి, వారి డ్రైవింగ్‌ను పరిశీలించారు. ఈ సమయంలో పిల్లలు డ్రైవింగ్‌ చేస్తూ సంగీతాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడినప్పటికీ వారికి డ్రైవింగ్‌లో ఏకాగ్రత లోపించడం అనేది స్పష్టంగా కనిపించిందని పరిశోధకులు తెలిపారు.

  • Loading...

More Telugu News