: నీటి చెలమల్లో ఆడుతున్నారా... జాగ్రత్త!
మీ పిల్లలు నీటి చెలమల్లో ఆడుతున్నారా... అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నిలువ ఉన్న నీటిలో వివిధ రకాల క్రిములు ఉండే ప్రమాదం వుంది. అవి మీ చిన్నారులకు హాని కలిగించే ప్రమాదం ఉంది. అమెరికాలోని జాకారి రెయినా అనే 12 ఏళ్ల చిన్నారి అరుదైన వ్యాధితో మరణించాడు. అతను ఇంటికి సమీపంలోని నీటి చెలమలో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు ఈ వ్యాధి సోకి ఉంటుందని అతని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
జాకారి రెయినా అనే బాలుడికి మెదడును తినేసే అరుదైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి సోకిన రెయినా శనివారం నాడు మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జాక్ యుద్ధం ముగిసింది. అందులో అతడే గెలిచాడు అని అతని కుటుంబ సభ్యులు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఎందుకంటే జాక్ అవయవాలను దానమివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జాక్‌కు నాగ్లేరియా ఫౌలేరియా అనే అరుదైన అమీబా సోకింది. ఈనెల 3న ఇంటికి సమీపంలోని నీటి చెలమలో ఆడుకోవడానికి వెళ్లినప్పుడు అతనికి ఈ పరాన్నజీవి సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.