: 26 రోజులుగా కొనసాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్రలో సమైక్యవాదుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 26 రోజులుగా జరుగుతున్న ఉద్యమం మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. విద్యార్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.