: హరికృష్ణ రాజీనామా.. పురంధేశ్వరి డ్రామాలో భాగం: కేఈ కృష్ణ మూర్తి


టీడీపీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణపై టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని తప్పుపట్టారు. కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఆడుతున్న నాటకంలో భాగంగానే హరికృష్ణ రాజీనామా చేశారని అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ల కాలంలో రాజ్యసభలో ఎన్నడూ పెదవి విప్పని హరికృష్ణ ఇప్పుడు కొత్త కథలు విన్పిస్తున్నారని కేఈ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ను పైకి తీసుకొచ్చేందుకే హరికృష్ణ ఈ కొత్త డ్రామాకి తెరతీశారని కేఈ కృష్ణమూర్తి అన్నారు.

  • Loading...

More Telugu News