: తెలుగు భాషపై 12 గంటల నిర్విరామ ప్రసంగం
తెలుగు భాషపై 12 గంటల పాటు నిర్విరామ ప్రసంగాన్ని ప్రముఖ రచయిత ద్వానా శాస్త్రి ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు ఇది హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో మొదలైంది. రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు, సాహిత్యం, కవితా రూపాలపై శాస్త్రి ప్రసంగిస్తారు. దీని ద్వారా నేటి తరం వారిలో తెలుగు భాషపై ఆసక్తి కలిగించాలన్నది లక్ష్యం. వంగూరి ఫాండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ విజ్ఞాన పీఠం, త్యాగరాయ గానసభ ఈ కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి.