: కంచుతో క్రిములకు చెక్‌ పెట్టచ్చు


రాగి, కంచు వంటి మిశ్రమ లోహాలు సూక్ష్మక్రిములను సమర్ధవంతంగా అడ్డుకుంటాయట. అందుకే ఆసుపత్రులు, బహిరంగ ప్రదేశాల్లోని స్థలాల్లో ఏర్పాటు చేసిన తలుపులకు, మెట్ల పక్కన రెయిలింగ్‌ వంటి వాటిని ఇలాంటి మిశ్రమ లోహాలతో తయారు చేస్తే మంచిదంటున్నారు నిపుణులు.

కంచు లాంటి లోహాలతో చేసిన పిడులను తలుపులకు వాడడం వల్ల ఆ లోహం సూక్ష్మక్రిమి నాశనిగా పనిచేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అందుకే అసుపత్రులు వంటి ప్రాంతాల్లోని తలుపులు, మెట్ల పక్కన పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన గొట్టాలను కంచు వంటి మిశ్రమ లోహాలతో తయారుచేయడం మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మందులకు కూడా లొంగని మొండివైన సూక్ష్మక్రిమి ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనేందుకు ఈ లోహం చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇలాంటి లోహాలు యాంటీ బయోటిక్‌ మందుల నిరోధకతను అడ్డుకుంటున్నట్టు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కొన్నిరకాలైన సూక్ష్మక్రిములు తలుపు పిడులు, గొట్టాలను పట్టుకోవడం ద్వారా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే రాగి, కంచు వంటి లోహాలతో తయారు చేసిన పిడులు ఈ క్రిములను చంపడమే కాకుండా వాటి జన్యుపదార్ధాన్ని కూడా నాశనం చేస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

  • Loading...

More Telugu News