: గుంటూరు కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం
గుంటూరు కోల్డ్ స్టోరేజీలో కొంతసేపటి కిందట అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఛాంబర్ లో నిల్వ ఉంచిన మిర్చి బస్తాలను ప్రస్తుతం బయటకు తరలిస్తున్నారు. మంటల కారణంగా వస్తున్న మిర్చి ఘాటుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో గుంటూరు, చిలకలూరిపేట రహదారిపై పలు వాహనాలు నిలిచిపోయాయి.