: అంబటి హరిప్రసాద్ కు ఫోన్ లో బాలకృష్ణ అభినందన
కృష్ణాజిల్లా అవనిగడ్డ ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్ధి అంబటి హరిప్రసాద్ కు సినీనటుడు బాలకృష్ణ ఫోన్ లో అభినందనలు తెలిపారు. టీడీపీ, అంబటి బ్రాహ్మణయ్య(హరిప్రసాద్ తండ్రి)పై అభిమానం వల్లే భారీ మెజార్టీతో విజయం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ ఈ తరహా విజయాలే సాధిస్తుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. అటు నందమూరి హరికృష్ణ కూడా హరి ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.