: మాదాపూర్లో ట్రాఫిక్ ఎస్సై జులుం


హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎస్సై జులుం చూపించాడు. మాదాపూర్ లో ట్రాఫిక్ ఎస్సై రాకేశ్ అనే ఓ మిఠాయి దుకాణదారుడిపై దాడికి దిగాడు. రాకేశ్ దుకాణం ఎదుట 'నో పార్కింగ్' బోర్డు ఉందని, అక్కడ వాహనాలు నిలుపరాదని ఎస్సై ఆదేశించాడు. ఈ విషయంపై ఎస్సై తో రాకేశ్ వాగ్వివాదానికి దిగడంతో, రెచ్చిపోయిన ఎస్సై 'నో పార్కింగ్ బోర్డు' తీసుకుని అతనిని చితకబాదాడు. ఈ దాడిలో బాధితుడు రాకేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఎస్సై తీరును తప్పుపట్టడంతో ఎస్సై అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం స్థానికులు బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News