: ఒక్కసారికే పనికొచ్చే సిరంజీ
వేరుశెనక్కాయ ఒకటే ఒకటి మీ చేతికి చిక్కింది. దాన్ని వేళ్లతో చితక్కొట్టి అందులో ఉన్న పల్లీ గింజలను గుటుక్కున మింగేశారు. ఇప్పడు ఆ ఖాళీ శెనక్కాయ మరొకరికి దొరికింది. దానిని వారు తినగలరా? ఎందుకూ పనికిరాదు. సరిగ్గా ఇదే ఆలోచనతో ఒక్కసారి ఇంజెక్షన్ చేసిన వెంటనే సూది, సిరంజి రెండూ కూడా వాటంతట అవే పనికి రాకుండా పోయేలా గొప్ప సిరంజీని కేరళ డాక్టర్ కనిపెట్టేశారు.
ఒక్కసారి ఈ సిరంజితో ఎవరికైనా సూది మందు వేస్తే చాలు ఇక మళ్లీ ఉపయోగించడానికి వీలుండదు. సిరంజీ మొన భాగం, సూది అడుగు భాగంలోని ప్లాస్టిక్ మెత్తబడిపోయేలా కేరళ డాక్టర్ బేబీ మనోజ్ దీన్ని తయారు చేశారు. అదిప్పుడు మానవాళికి మహోపకారి కానుంది. వాడిన సిరంజీలు, సూదులనే స్టెరిలైజ్ చేయకుండా మళ్లీ మళ్లీ వాడుతున్నందున ఏటా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భయంకరమైన ఎయిడ్స్, హెపటైటిస్ వ్యాధుల బారిన పడుతున్నారు.
ఏటా 600 కోట్లు వాడిన సిరంజీలే కొత్తవిగా మళ్లీ మామార్కెట్ లోకి వస్తున్నాయని ఫలితంగా ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. భారత్ లో ఏటా 10లక్షల మందికిపైగా ఈ వ్యాధుల బారిన పడుతుంటే అందులో మూడు లక్షల మంది వరకూ మరణిస్తున్నారు. ఇప్పడు డాక్టర్ మనోజ్ కనిపెట్టిన కొత్తరకం సిరంజీ ఎన్నో ప్రాణాలను కాపాడడానికి ఉపకరిస్తుంది.

గత వారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మనోజ్ సిరంజికి 2011 సంవత్సరానికి సంబంధించి ఉత్తమ పరిశోధన అవార్డును జాతీయ పరిశోధనాభివద్ధి సంస్థ అందించింది. మనోజ్ కేరళలోని కోజికోడ్ లో రేడియాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.