: న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచండి: విజయమ్మ


రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే మూడిట్లో ఏ ప్రాంతానికీ అన్యాయం జరగకుండా చూడాలని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు సమ న్యాయం చేయాలని, అలా కాని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ వారిదే అనడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. నదీ జలాలు ఎలా పంచుతారు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తారని ఆమె ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News