: ఏ కమిటీ వేసినా ప్రాతిపదిక, అధికారాలు ముందే చెప్పాలి: ఎంపీ అనంత


రాష్ట్ర విభజనపై ఏ కమిటీ వేసినా దాని ప్రాతిపదిక, దానికుండే అధికారాలు ప్రజలకు బహిర్గతం చేయాలని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలోని చిరంజీవి నివాసంలో జరిగిన భేటీ అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందని అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు విధులను బహిష్కరిస్తున్నారని అన్నారు. వ్యవసాయదారులు తమతమ పనుల్ని కూడా మానుకుని ఉద్యమంలో భాగస్వాములవుతున్నారని తెలిపారు. సోమవారం మరో సారి భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని స్పష్టం చేశారు. రాయల తెలంగాణ కోరుతూ తానెప్పుడూ లేఖ ఇవ్వలేదని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా ఎలా పడితే అలా విభజన చేస్తారా అని ప్రశ్నిచారు. ప్రజల అభీష్టాన్ని నెరవేర్చడం ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యత అని అనంత అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News