: పార్లమెంట్ ఆవరణలోనే నిరాహార దీక్షకు టీడీపీ ఎంపీల నిర్ణయం


లోక్ సభ నుంచి సస్పెన్షన్ కు గురయిన టీడీపీ ఎంపీలు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజల్లోకి వెళ్లాలని కొందరు అభిప్రాయపడగా, మరి కొందరు పార్లమెంటులోనే పోరాటం సాగిద్దామని సూచించారు. దీంతో ఏ రకంగా పోరాటాన్ని సాగిస్తే బాగుంటుందనే విషయంపై సుదీర్ఘంగా సమాలోచనలు చేసిన టీడీపీ ఎంపీలు, మరో సారి పార్లమెంటు ఆవరణలోనే నిరసన తెలిపేందుకు సిద్దమవుతున్నారు. సభా కార్యక్రమాల్లో పాల్గొనకుండా తమపై సస్పెన్షన్ వేటు ఉన్నందు వల్ల పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సోమవారం నుంచి నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు నెరవేరాలన్నది, రాష్ట్ర విభజనను వెనక్కి తీసుకోవాలన్నదే తమ ప్రధాన డిమాండ్ గా నిరాహార దీక్షకు దిగనున్నారు.

  • Loading...

More Telugu News