: గాలి బెయిల్ కేసు నిందితులకు సుప్రీం నోటీసులు
బెయిల్ కుంభకోణం కేసులో 8 మంది నిందితులకు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఏసీబీ పిటిషన్ వేసింది. దీనిపై విచారించిన కోర్టు.. గాలి సోదరులు, మాజీ జడ్జి పట్టాభి రామారావు, చలపతిరావులకు నోటీసులు జారీ చేసింది. అయితే జారీచేసిన నోటీసులపై ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని న్యాయస్థానం నిందితులను ఆదేశించింది.
గతంలో పట్టాభి రామారావు, చలపతిరావులకు హైకోర్టు బెయిల్ జారీ చేసిన సమయంలో.. వారు అతిక్రమించిన విధానాలను సరిగా పరిగణలోకి తీసుకోకుండానే బెయిల్ ఇచ్చిందని ఏసీబీ అధికారులు తమ పిటిషన్ లో పేర్కొన్నారు.