: కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేయాలి: టీడీపీ ఎంపీలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు తక్షణం రాజీనామాలు చేయాలని టీడీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఢిల్లీలో వారు మాట్లాడుతూ విందు సమావేశాలతో కాలయాపన చేయకుండా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. లోక్ సభ నుంచి సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. సస్పెన్షన్ పునఃపరిశీలించాలని స్పీకర్ కు లేఖలు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు నాటకాలకు తెరతీయకుండా నిజాయతీగా సీమాంధ్ర ప్రజలకోసం పోరాడాలని అన్నారు.