: మూడోసారీ యూపీఏదే అధికారం: సోనియా గాంధీ
ముచ్చటగా మూడోసారి యూపీఏదే అధికారమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. యూపీఏ-2 ప్రభుత్వం ఐదేళ్ల కాలం పాటు పూర్తిగా అధికారంలో కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఢిల్లీలో జాతీయ మీడియా సెంటర్ ను ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలోనే ఆహార భద్రత బిల్లు ఉభయ సభల ఆమోదం పొందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.