: కేంద్ర మంత్రికి సమైక్య సెగ
కర్నూలు జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. తాజాగా ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర మద్దతుదారులు తమ ప్రాంత అభీష్టానికి అనుకూలంగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ రాజీనామా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.