: రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచే ఆలోచన సోనియాకు లేదు: జేసీ
అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే ఆలోచన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తే నీటి యుద్ధాలు తప్పవన్నారు. ట్రిబ్యునళ్లు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నీటి కోసం గొడవ పడుతున్న విషయాన్ని దివాకర్ రెడ్డి ఉదహరించారు. వచ్చే ఎన్నికల్లో తాను తాడిపత్రి నుంచి పోటీచేస్తే డిపాజిట్లు కూడా దక్కవంటూ వ్యాఖ్యానించారు.