: ప్రధాని చేతుల మీదుగా 'జాతీయ మీడియా కేంద్రం' ప్రారంభం
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రాన్ని ప్రారంభించారు. రూ. 60 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రంలో ప్రజలకు సమాచారాన్ని మరింత వ్యాపింపజేసేందుకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉంచారు. ఇందులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కార్యాలయాలు, మీడియాకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. మూడు సంవత్సరాల్లో నిర్మించనున్న కొత్త కేంద్రంలో మీడియా సమావేశాలకు, జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలు ఉండనున్నాయి.