: విద్యార్ధుల్లో చదువుకునే శక్తి తగ్గిపోతోందట


ఒకప్పుడు విద్యార్ధులు చక్కగా పాఠాలను చదివేవారు. కానీ కాలం మారుతోంది... ఇప్పుడు ఎక్కడ చూసినా కాలేజీ లేదా ఇతర డిగ్రీలు చదివేవారు ఎక్కువగా ల్యాప్‌టాప్‌లతో చదువుతున్నారు. చాలామంది భుజానికో బ్యాగులో ల్యాప్‌టాప్‌తో మనకు కనిపిస్తుంటారు. ఇదే విషయంపై నిర్వహించిన తాజా అధ్యయనంలో విద్యార్ధుల్లో చదువుకునే శక్తి తగ్గిపోతోందని తేలింది. పిల్లలు ప్రతి చిన్న విషయానికి ల్యాప్‌ట్యాప్‌పై ఆధారపడడం, కొందరు ల్యాప్‌టాప్‌లలో గేమ్స్‌ ఆడడం, వీడియో ఛాటింగ్‌లు వంటివి ఎక్కువగా చేస్తున్నారని శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

కెనడా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు అధ్యయనకర్తలు విశ్వవిద్యాలయ విద్యార్ధుల్లో ల్యాప్‌టాప్‌ వాడకంపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో ల్యాప్‌టాప్‌ వాడకం వల్ల మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతోందని తేలింది. ఒకప్పుడు ఎక్కువ సమయం రాయడానికి విద్యార్ధులు సమయాన్ని వెచ్చించాల్సి వచ్చేది. అయితే కాలం మారుతోంది. ఇప్పుడు ఏదైనా ఎంచక్కా వీడియో పాఠాల రూపంలో అందుబాటులో లభిస్తోంది. దీంతో రాతపని తగ్గిపోయింది. వీడియో పాఠాల ద్వారా అభ్యసనం ఎక్కువవుతోంది. ఒకప్పటి కాలంతో పోలిస్తే పేపరు, పెన్నుల వాడకం బాగా తగ్గిందని, అలాగే లాప్‌ట్యాప్‌ వాడకానికన్నా ముందు మంచి మార్కులు వచ్చేవని, ల్యాప్‌టాప్‌ వాడకం ప్రారంభించిన తర్వాత మార్కులు తగ్గుతున్నాయని కూడా ఈ అధ్యయనంలో తేలింది.

సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకుంటే పిల్లలు మరింత అభివృద్ధి సాధించవచ్చని, అయితే పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఇలా మార్కులు తగ్గిపోతున్నాయని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ల్యాప్‌టాప్‌లు వాడేవారు ఎక్కువగా వాటిద్వారా చదవడంకన్నా సినిమాలు చూడడం, పాటలు వినడం, ఛాటింగ్‌ చేయడం వంటివి ఎక్కువగా చేస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే ల్యాప్‌టాప్‌లో మల్టీటాస్కింగ్‌ వల్ల ఏ ఒక్కదానిపైన విద్యార్ధులు సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నారని, ఇది క్రమంగా వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తితోబాటు విషయాన్ని అర్థం చేసుకునే శక్తిపైన కూడా ప్రభావం చూపుతోందని అధ్యయనకర్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News