: కడప జిల్లాలో గెజిటెడ్ ఉద్యోగుల సమ్మె బాట
సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. ఏపీఎన్జీవోలకు మద్దతుగా కడప జిల్లాలో ఇవాళ అర్థరాత్రి నుంచి గెజిటెడ్ ఉద్యోగులు సమ్మెబాట పట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,500 మంది గెజిటెడ్ ఉద్యోగులు సమ్మె చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు వారు జిల్లా కలెక్టర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు. జిల్లాలో గెజిటెడ్ ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.