: అర్టీసీ బస్ స్టాండ్లలో ప్రాధమిక చికిత్సా కేంద్రాలు: ఏకే ఖాన్
ప్రయాణీకుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రధాన బస్టాండ్లలో త్వరలో వైద్యశాలలు ప్రారంభించనున్నట్టు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ తెలిపారు. హైదరాబాద్ లో జూబ్లీబస్ స్టాండులో ప్రాధమిక చికిత్స కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రయాణీకులకు అత్యవసర సమయాల్లో చికిత్స అందించే ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీబస్టాండ్ లో 10 లక్షల రూపాయలతో ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బస్టాండ్లలో ప్రయాణీకులకు సదుపాయాలు మెరుగుపరుస్తామన్న ఆయన, దీని కోసం ఏటా వంద కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.