: ఎయిమ్స్ లో చేరిన ఉగ్రవాది టుండా
లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను పోలీసులు ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. 70 ఏళ్ల టుండా ఛాతీ నొప్పి అంటూ ఫిర్యాదు చేయడంతో అతడ్ని సఫ్థర్ జంగ్ ఆసుపత్రిలో చేర్చిన అధికారులు, ఈ ఉదయం మరింత మెరుగైన భద్రత, వైద్యం కోసం ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. టుండాను గత వారం ఇండో నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. టుండాపై సుమారు 20 వరకు బాంబు పేలుళ్ల కేసులు ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అంటూ పాక్ కు భారత్ అందించిన జాబితాలో టుండా పేరు కూడా ఉంది.